సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన రఫీ, షకీరా దంపతులకు ఫర్జానా, ఆస్మా ఇద్దరు కుమార్తెలు. వీరి పక్కింట్లోనే ఉంటున్న బాబు అంజలిల కూతురు అక్షిత... ఈ ముగ్గురు చిన్నారుల కలిసి ఇంటికి దగ్గర్లోనే ఆడుకుంటున్నారు. వారికి పొదల్లో ఓ ప్యాకెట్ దొరికింది. అదేంటో తినేదనుకుని నీళ్లలో కలుపుకొని ముగ్గురూ తాగేశారు. తర్వాత ఇంటికొచ్చి భోజనం కూడా చేశారు. తర్వాత కాసేపట్లోనే ముగ్గురి నోట్లోంచి నురగలు రావడం గమనించారు కుటుంబ సభ్యులు. వెంటనే వారిని స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఆలస్యమైనందున ఖమ్మంకి తీసుకెళ్లడం మంచిదని వైద్యులు సూచించారు. ఇందులో ఫర్జానా, అక్షితల పరిస్థితి విషమంగా ఉంది. పిల్లలు ఏమైపోతారోనని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
పురుగుల మందు తాగిన చిన్నారుల పరిస్థితి విషమం - CHILDRENS
అభం శుభం తెలియని ముగ్గురు చిన్నారులు... ఇంటి ఆవరణలోనే ఆడుకుంటూ వెళ్లి పురుగుల మందని తెలియక నీళ్లలో కలుపుకొని తాగేశారు. నిన్న జరిగిన ఈ ఘటనలో పిల్లల పరిస్థితి విషమంగా ఉంది. ముగ్గురు చిన్నారులు ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య ఉన్నారు.
'పురుగుల మందని తెలియక నీళ్లలో కలుపుకొని తాగేశారు'