తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉరేసుకుని వివాహిత ఆత్మహత్య - crime news

ఉరేసుకుని వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లా దొమ్మాట గ్రామంలో జరిగింది. తాగుడుకు బానిస అయిన భర్త ఆగడాలను భరించలేకే చనిపోయినట్లు మృతురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

woman suicide in siddipet district
ఉరేసుకుని వివాహిత ఆత్మహత్య

By

Published : May 7, 2020, 8:54 PM IST

సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం దొమ్మాట గ్రామానికి చెందిన ఈదన్నగారి బాలమని(28) అనే వివాహిత బుధవారం సాయంత్రం 4గంటలకు తన ఇంట్లో చీరతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. తాగుడుకు బానిస అయిన భర్త ఆగడాలను భరించలేక విరక్తితో ఆత్మహత్య చేసుకున్నట్లు మృతురాలి తండ్రి తెలిపాడు.

మృతురాలికి 11 సంవత్సరాల క్రితం దొమ్మాట గ్రామానికి చెందిన బాబుతో వివాహం జరిగింది. మృతురాలికి కూతురు,కుమారుడు ఉన్నారు. మృతురాలి తండ్రి బాలయ్య ఫిర్యాదు మేరకు దౌల్తాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చూడండి: పెళ్లైన మూడు నెలలకే నవవధువు ఆత్మహత్య

ABOUT THE AUTHOR

...view details