సిద్దిపేట జిల్లా దుబ్బాక డిపో వద్ద ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరడానికి వినతి పత్రాలతో వెళ్లారు. పోలీసులు వారిని డిపో లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. డిపో మేనేజర్‌ను కలిసి వినతిపత్రాలిస్తామని కోరగా మేనేజర్ లేరని పోలీసులు తెలిపారు. వినతిపత్రాలను స్వీకరించి కార్మికులను విధుల్లోకి తీసుకునేలా చేయమని కోరారు. 52 రోజులు చేసిన సమ్మెను విరమించినా.. ముఖ్యమంత్రి తమపై మొండి వైఖరి చూపిస్తున్నారంటూ కార్మికులు వాపోయారు.
విధుల్లో చేరేందుకు వచ్చిన కార్మికుల అడ్డగింత - tsrtc employees strike in dubbaka
సిద్దిపేట జిల్లా దుబ్బాక ఆర్టీసీ డిపో వద్ద వినతి పత్రాలతో విధుల్లో చేరేందుకు వెళ్లిన కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు.
విధుల్లో చేరేందుకు వచ్చిన కార్మికుల అడ్డగింత