నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించకుండానే పోలీసులతో బలవంతంగా గ్రామాలను ఖాళీ చేయించడం రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయికి తగదని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్, కోహెడ వద్ద రైతులను పరామర్శించడానికి వెళ్తూ ప్రజ్ఞాపూర్ వద్ద మీడియా సమావేశం నిర్వహించారు. కొండపోచమ్మ ప్రాజెక్టు నిర్మాణం కోసం భూములు కోల్పోయిన నిర్వాసితులకు 2013 చట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లించడం లేదని తెలిపారు.
'బలవంతంగా ఖాళీ చేయించడం సీఎం స్థాయికి తగదు' - kondapochamma sagar
కొండపోచమ్మ నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించకుండా పోలీసులతో బలవంతంగా గ్రామాలను ఖాళీ చేయించడం సీఎం స్థాయికి తగదని పీసీసీ చీఫ్ ఉత్తమ్ అన్నారు. కోర్టుకెక్కిన నిర్వాసితులను పోలీసులతో బెదిరించి ఇళ్లను ఖాళీ చేయించడం కోర్టు ధిక్కరణ కాదా అని ముఖ్యమంత్రిని ప్రశ్నించారు.
'బలవంతంగా గ్రామాలను ఖాళీ చేయించడం సీఎం స్థాయికి తగదు'
నష్టపరిహారం కోసం ప్రభుత్వాన్ని కోరుతూ కోర్టుకెక్కిన నిర్వాసితులకు అర్ధరాత్రి పోలీసులతో భయానక వాతావరణం సృష్టించి ఇళ్లను ఖాళీ చేయించడం కోర్టు ధిక్కరణ కాదా అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రశ్నించారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: ప్రభుత్వ వైఫల్యం వల్లే రైతులకు ఇబ్బందులు: ఉత్తమ్