సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం రాయవరం గ్రామానికి చెందిన దళిత బాలికపై జరిగిన అత్యాచార ఘటనపై గతంలో అట్రాసిటీ కేసు నమోదయింది. బాధితురాలికి అందాల్సిన పరిహారంపై ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆదివారం ఆరా తీశారు. బాధితురాలని పరామర్శించినట్టు ఆయన తెలిపారు. ఆమెకు ఇప్పటివరకు పూర్తిస్థాయిలో పరిహారం అందలేదని గుర్తించిన ఆయన పూర్తి పరిహారాన్ని తక్షణమే ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
'రెండురోజుల్లో అట్రాసిటీ పరిహారం అందించాలి'
సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం రాయవరానికి చెందిన బాలిక అట్రాసిటీ కేసు పరిహారంపై ఎస్సీ ఎస్టీ కమిషన్ ఆరా తీసింది. పూర్తిస్థాయిలో పరిహారం అందలేదని తెలిసి రెండు రోజుల్లో బాధితురాలకి డబ్బు అందించాలని ఆదేశించింది.
'రెండురోజుల్లో అట్రాసిటీ పరిహారం అందించాలి'
ముఖ్యమంత్రి నియోజకవర్గంలో అట్రాసిటీ పరిహారం చెల్లింపు జాప్యంలో అధికారులపై ఆయన మండిపడ్డారు. ఇకమీదట పరిహారం చెల్లింపులో నిర్లక్ష్యం చేయకుండా త్వరితగతిన బాధితులకు సొమ్మును అందజేయాలని ఆయన అధికారులకు సూచించినట్లుగా తెలిపారు.