సిద్దిపేట జిల్లా దుబ్బాక బస్ డిపోలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి ఆర్టీసీ కార్మికులు పాలాభిషేకం చేశారు. 55 రోజులు సమ్మెలో పాల్గొన్న ఆర్టీసీ కార్మికుల జీతాలను విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఇచ్చిన మాటకు కట్టుబడి సమ్మె కాలానికి వేతనాలు విడుదల చేయడం సంతోషాన్ని ఇచ్చిందన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి ఎల్లప్పుడు రుణపడి ఉంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక ఆర్టీసీ డిపో డ్రైవర్లు, కండక్టర్లు పాల్గొన్నారు.
కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం - siddipeta latest news
ఆర్టీసీ కార్మికుల సమ్మె చేసిన 55 రోజుల జీతాన్ని విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం పట్ల సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఆర్టీసీ కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. బస్ డిపోలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం