పర్యావరణానికి ప్లాస్టిక్ పెనుముప్పుగా మారింది. ప్లాస్టిక్ కవర్లు, సంచులకు ప్రత్యామ్నాయంగా జనపనార సంచుల తయారీపై సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని జనవికాస గ్రామీణాభివృద్ధి సంస్థ మహిళలకు శిక్షణ ఇస్తోంది. మహిళలకు కుట్లు- అల్లికలు నేర్పిస్తున్న ఈ సంస్థ... ప్లాస్టిక్ భూతాన్ని పారద్రోలేందుకు వారికి జనపనార సంచుల తయారీపై ఉచిత శిక్షణను ఇప్పిస్తున్నారు.
ప్లాస్టిక్ ప్రత్యామ్నాయ తయారీపై మహిళలకు శిక్షణ - plastic alternate cloth bags stitching training for ladies in siddipet
పర్యావరణ పరిరక్షణకు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో జనవికాస గ్రామీణాభివృద్ధి సంస్థ కృషి చేస్తోంది. ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా జనపనార సంచులను తయారుచేయిస్తూ మహిళలకు స్వయం ఉపాధినీ కల్పిస్తున్నారు.
ప్లాస్టిక్ ప్రత్యామ్నాయ తయారీపై మహిళలకు శిక్షణ
హుస్నాబాద్, అక్కన్నపేట మండలాలకు చెందిన 15 మంది మహిళలకు ఈ నెల 19న శిక్షణ ప్రారంభించారు. వారికి 23 రకాల బ్యాగులు కుట్టడం నేర్పించారు. ఇలా సంచుల తయారీపై శిక్షణ అందిస్తూ వారికి స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న సంస్థకు మహిళలు కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చూడండి:'నిర్భయ' కేసులో మరో దోషి క్యురేటివ్ పిటిషన్