ప్రాజెక్టు నిర్మాణంలో గ్రామం మునిగిపోయింది. ఊరును వదిలిపెట్టాలంటే ఎవరికైనా బాధగానే ఉంటుంది. కానీ సకల సౌకర్యాలతో సిద్దిపేట జిల్లా కొచ్చగుట్టపల్లిలో పునరావాసాన్ని ప్రభుత్వం నిర్మించింది. రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు ముఖ్యఅతిథిగా హాజరై... సామూహిక నూతన గృహప్రవేశాలను ప్రారంభించారు. గ్రామానికి రంగనాయకమ్మపల్లిగా నామకరణం చేశారు. కాలనీలో కల్పించిన మౌలిక సదుపాయాలు, కాలనీవాసుల అభిప్రాయాలను తెలుసుకుందాం...
సకల సౌకర్యాలతో పునరావాసం... స్థానికుల్లో సంతోషం
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా... ముంపునకు గురవుతున్న కొచ్చగుట్టపల్లి నిర్వాసితుల కోసం సిద్దిపేట శివారులో పునరావాసాన్ని నిర్మించారు. భూసేకరణ చట్టం-2013 అమలులోకి వచ్చిన తర్వాత దేశంలోనే మొట్టమొదటి కాలనీకి సిద్దిపేట వేదికైంది. కాలనీ వివరాలను మా ఈటీవీ భారత్ ప్రతినిధి అందిస్తారు.
సకల సౌకర్యాలతో పునరావాసం... స్థానికుల్లో సంతోషం