తెలంగాణ

telangana

ETV Bharat / state

'పదో తరగతి విద్యార్థులు పత్తి ఏరేందుకు అస్సలు పోవద్దు...'

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో మంత్రి హరీశ్​రావు పర్యటించారు. పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి... విద్యాధికారులకో సమీక్షించారు. కేజీబీవీ విద్యార్థులతో ముచ్చటించారు. వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని సూచించారు.

MINISTER HARISHRAO ON KGBV 10TH CLASS STUDENTS PASS PERCENTAGE

By

Published : Nov 20, 2019, 1:57 PM IST

పదో తరగతి విద్యార్థులు ఎట్టిపరిస్థితిలో పత్తి ఏరేందుకు వెళ్లటానికి వీళ్లేదని మంత్రి హరీశ్​రావు సూచించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో మంత్రి హరీశ్​రావు పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్మించిన నూతన భవన సముదాయాన్ని మాజీ స్పీకర్ మధుసూదనాచారి, ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి, ఎమ్మెల్యే సతీష్ కుమార్​తో కలిసి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో విద్యార్థుల ఉత్తీర్ణత శాతం 100 శాతం వచ్చేలా కృషి చేయాలని కస్తూర్బా గాంధీ విద్యాలయాల ప్రత్యేక అధికారిణి మనీలాకు ఆదేశించారు. కేజీబీవీల్లో పదో తరగతిలో కనీసం ఐదుగురికైనా 10కి పది రావాలని పిల్లలకు తెలిపారు. 10/10 ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు రూ.25 వేల ప్రోత్సాహక బహుమతి అందిస్తామని మంత్రి తెలిపారు. సాయంత్రం వేళలో ప్రత్యేక తరగతులు తీసుకునే సమయంలో అవసరమైన అల్పాహారాన్ని అందించడానికి రూ. 36 లక్షలు మంజూరు చేస్తున్నట్లు హరీశ్​రావు తెలిపారు.

'పదో తరగతి విద్యార్థులు పత్తి ఏరేందుకు అస్సలు పోవద్దు...'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details