సిద్దిపేట నియోజకవర్గంలోని 45 మంది లబ్ధిదారులకు మంత్రి హరీశ్‌రావు తన నివాసంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. చెక్కులు వెంటనే తమ బ్యాంకు ఖాతాలో జమ చేసుకోవాలని లబ్ధిదారులకు హరీశ్‌రావు సూచించారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందించాలని ఉన్నతాధికారులకు సూచించారు. అవసరమైతే కార్పొరేట్ ఆస్పత్రిలో వైద్య చికిత్సను ఇప్పించాలని... పేషంట్లు కోలుకునేవరకు సాయం చేస్తామని హామీ ఇచ్చారు.
లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేసిన మంత్రి - లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేసిన మంత్రి
మంత్రి హరీశ్‌రావు సిద్ధిపేటలోని తన నివాసంలో 45 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేసిన మంత్రి