ETV Bharat / state

సాహసం శ్వాసగా సాగిపోతున్న యువత - sports

శారీరక దృఢత్వానికి వ్యాయామం ఎంతగా దోహద పడుతుందో సాహసక్రీడలూ అంతే ఉపయోగపడతాయి. ఫిట్​నెస్​తో పాటు ఆత్మవిశ్వాసాన్ని, నిర్ణయాలు తీసుకునే సామర్ధ్యాన్ని ఇవి పెంపొందిస్తాయి. సాహస క్రీడలకు ఆదరణ తక్కువైనా కొందరు విద్యార్థులు మాత్రం ఆసక్తి కనబరుస్తున్నారు.

adventure-camp-in-nizamabad-district
సాహసం శ్వాసగా సాగిపోతున్న యువత
author img

By

Published : Dec 25, 2019, 2:48 PM IST

సాహసం శ్వాసగా సాగిపోతున్న యువత

విద్యార్థుల్లో ధైర్యం, ఆత్మస్థైర్యం పెంపొందించేందుకు నిజామాబాద్‌ రోటరీ క్లబ్‌ సాహస క్రీడల శిక్షణకు శ్రీకారం చుట్టింది.

గత ఐదేళ్లుగా సాహస క్రీడలు

గత ఐదేళ్లుగా నిజామాబాద్​ జిల్లా ఎడపల్లి మండలం అలీసాగర్‌ అటవీ ప్రాంతంలో ఈ క్రీడలను నిర్వహిస్తోంది. మంగళవారం కూడా 225 మందికి తర్ఫీదు ఇచ్చారు. ఈ క్రీడలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర నుంచి పలు పాఠశాలలకు చెందిన విద్యార్థుల బృందాలు శిక్షణ పొందేందుకు ఇక్కడికి వచ్చాయి. పలు అంశాల్లో శిక్షకులు శిక్షణ ఇచ్చారు.

రోజంతా శిక్షణ

పెద్ద పెద్ద బండరాళ్లు ఎక్కడం, దిగడం, పడవ ప్రయాణం, గుర్రపు స్వారీ, విలు విద్య, ఆస్ట్రేలియన్‌ నడకలో శిక్షణ పొందారు. రోజంతా సాహస క్రీడల శిక్షణ కొనసాగింది.

ఆత్మవిశ్వాసం నింపేందుకు

పిల్లల్లో భయం తొలగించి వారిని అన్ని రంగాల్లో ముందుకు వచ్చేలా ఈ సాహస క్రీడలు దోహద పడతాయని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్‌ ప్రతినిధులు జగదీశ్వర్‌ రావు, శ్రీరామ్‌ సోనీ, శ్రీనివాస్‌రావు, రాజేశ్వర్‌, డా.విశాల్‌, దర్శన్‌ సింగ్‌, ప్రకాశ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని బలి తీసుకున్న ప్రమాదం

Intro:TG_NZB_10_24_ADVENTURE_CAMP_PKG_TS10109
()
ప్రకృతిలో సంభవించే వైపరిత్యాలను ఎదుర్కొనేందుకు సాహస క్రీడలు ఎంతగానో దోహదపడతాయి. సాహస క్రీడలకు ఆదరణ తక్కువైనా కొందరు విద్యార్థులు మాత్రం ఆసక్తి కనబరుస్తున్నారు. ఇదే తరహాలో విద్యార్థుల్లో ధైర్యం, ఆత్మస్థైర్యం పెంపొందించేందుకు నిజామాబాద్ రోటరీ క్లబ్ సాహస క్రీడల శికణకు శ్రీకారం చుట్టింది. గత ఐదేళ్లుగా ఎడపల్లి మండలం లోని అలీ సాగర్ అటవీ ప్రాంతంలో సాహస క్రీడలను నిర్వహిస్తోంది. మంగళవారం 225 మందికి సాహస క్రీడల్లో తర్ఫీదు ఇచ్చారు. ఈ క్రీడలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర నుంచి పలు పాఠశాలలకు చెందిన విద్యార్థుల బృందాలు శిక్షణ పొందేందుకు ఇక్కడికి వచ్చాయి. పలు క్రీడలపై శిక్షకులు శిక్షణ ఇచ్చారు. పెద్ద పెద్ద బండరాళ్లు ఎక్కడం, దిగడం, పడవ ప్రయాణం, గుర్రపు స్వారీ, విలు విద్య, ఆస్ట్రేలియన్ నడక లో శిక్షణ పొందారు. రోజంతా సాహస క్రీడల శిక్షణ కొనసాగింది. పిల్లలలో భయం తొలగించి వారిని అన్ని రంగాలలో ముందుకు వచ్చేలా ఈ సాహస క్రీడలు దోహద పడతాయని నిర్వాహకులు తెలిపారు.
Byte 1 : అవిశి
Byte 2 : వినిత్
Byte 3 : శ్రీనిధి
Byte 4 : ఫయాజ్
Byte 5 : జగదీశ్వర్ రావు, రైల చైర్మన్
Byte 6 : శ్రీనివాస్ రావు
End

Body:శివ ప్రసాద్

Conclusion:9030175921
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.