పల్లె ప్రగతి కార్యక్రమం సీఎం కేసీఆర్ మానస పుత్రిక అని మంత్రి హరీశ్‌రావు అన్నారు. రెండో విడత కార్యక్రమంపై సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో జరిగిన జిల్లా స్థాయి సమీక్షకు ఆయన హాజరయ్యారు. గజ్వేల్ పట్టణంలోని మహతి ఆడిటోరియం ఇందుకు వేదికైంది. 30 రోజుల ప్రణాళికలో భాగంగా గ్రామాల్లో సాధించిన పురోగతిపై మండలాల వారీగా మంత్రి సమీక్షించారు. మొదటి విడతలో మెరుగుపడని గ్రామ పంచాయతీలు, రెండవ దశలో మంచి ఫలితాలను సాధించాలన్నారు. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం పల్లె ప్రగతితోనే సాధ్యమవుతుందన్నారు. దేశంలోని ఇదో విన్నూత కార్యక్రమమన్న హరీశ్.. పట్టణాలకు దీటుగా పల్లెలు అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. 30 రోజుల ప్రణాళికలో సర్పంచులు చాలా బాగా పనిచేశారని, రెండో విడతలోనూ ఇదే స్ఫూర్తిని కొనసాగించి సిద్దిపేట జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలని సూచించారు.
పల్లె ప్రగతిలో సిద్దిపేట తొలిస్థానంలో నిలవాలి: హరీశ్ - గజ్వేల్‌లో పల్లె ప్రగతిపై సమీక్ష
పల్లెప్రగతి కార్యక్రమంతో పట్టణాలకు దీటుగా పల్లెలు అభివృద్ధి బాట పడతాయని మంత్రి హరీశ్ రావు అన్నారు. 30 రోజుల ప్రణాళికలో పనిచేసిన విధంగా ఈ కార్యక్రమంలోనూ కృషిచేయాలని సూచించారు. సిద్దిపేటను తొలిస్థానంలో నిలపాలని కోరారు.
పల్లె ప్రగతిలో సిద్దిపేట తొలిస్థానంలో నిలవాలి: హరీశ్