తెలంగాణ

telangana

ETV Bharat / state

అధికారులపై మంత్రి హరీశ్​రావు కన్నెర్ర - అధికారులపై మంత్రి హరీశ్​రావు కన్నెర్ర

కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్​ చెక్కుల పంపిణీలో అలసత్వం ప్రదర్శించిన అధికారులపై ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం అర్హులైన లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు.

అధికారులపై మంత్రి హరీశ్​రావు కన్నెర్ర
అధికారులపై మంత్రి హరీశ్​రావు కన్నెర్ర

By

Published : Jan 29, 2020, 8:01 PM IST

సిద్దిపేట జిల్లా ఆర్డీవో కార్యాలయంలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. బడ్జెట్ ఉన్నా కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ ఆలస్యం కావడం పట్ల అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చెక్కులు మండలాల వారిగా ఎన్ని పెండింగ్​లో ఉన్నాయో తెలుసుకున్నారు. సంతకాలు పూర్తైనా ఇవ్వకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటివి మళ్లీ పునరావృతం కాకూడదని హెచ్చరించారు. అనంతరం అర్హులైన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఇది దేశంలో ఏ ప్రభుత్వం చేయనటువంటి అద్భుత కార్యక్రమమని పేర్కొన్నారు. నియోజకవర్గంలోని అర్హులైన 74 మందికి 74 లక్షల 8 వేల584 రూపాయలు చెక్కు అందించారు.

అధికారులపై మంత్రి హరీశ్​రావు కన్నెర్ర

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details