తెలంగాణ

telangana

By

Published : Jun 3, 2020, 3:27 PM IST

Updated : Jun 3, 2020, 4:01 PM IST

ETV Bharat / state

ఘనంగా మంత్రి హరీశ్​రావు​ జన్మదిన వేడుకలు

రాష్ట్రవ్యాప్తంగా తెరాస కార్యకర్తలు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​రావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేకు కట్​ చేసి సంబురాలు జరుపుకున్నారు.

Minister harish rao birthday celebrations in siddipeta, sangareddy districts
ఘనంగా మంత్రి హరీశ్​రావు​ జన్మదిన వేడుకలు

ఘనంగా మంత్రి హరీశ్​రావు​ జన్మదిన వేడుకలు

సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​రావు జన్మదినాన్ని తెరాస నాయకులు ఘనంగా నిర్వహించారు. జహీరాబాద్​లో మాజీ కౌన్సిలర్, తెరాస నాయకుడు రవికిరణ్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే మాణిక్ రావు, ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్ ప్రారంభించారు. అంతకుముందు కేక్ కట్​చేసి సంబరాలు జరుపుకున్నారు. సంగారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో మంత్రి పుట్టినరోజును పురస్కరించుకుని మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.

సిద్దిపేట జిల్లా గజ్వేల్​లో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణ శివారులోని కేసరి హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కార్యకర్తల మధ్య కేక్ కట్ చేశారు. గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. గజ్వేల్​లో జరిగిన వేడుకల్లో వంటేరు ప్రతాపరెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ రాజమౌళి తదితరులు పాల్గొన్నారు. జిల్లాలోని తొగుటలో తెరాస నాయకులు చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించి... మాస్కుల పంపిణీ చేశారు.

ఇవీ చూడండి: సీఎం కేసీఆర్​కు కేంద్రమంత్రి కిషన్​రెడ్డి లేఖ

Last Updated : Jun 3, 2020, 4:01 PM IST

ABOUT THE AUTHOR

...view details