మొక్కజొన్న రైతులు ఎలాంటి ఆందోళన పడొద్దు... ప్రతీ గింజ కొంటామని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు భరోసా ఇచ్చారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలో మొక్కజొన్న దిగుబడిని పరిశీలించారు. అనంతరం రైతులతో మాట్లాడారు. "వేరే దేశాల నుంచి మక్కలు కొంటే... మన మక్కలు మోరి పాలేనా...?" అంటూ రైతులు అడిగిన ప్రశ్నలకు హరీశ్‌రావు సమాధానమిచ్చారు.
'మొక్కజొన్న రైతులు ఆందోళన పడకండి... ప్రతీ గింజ కొంటాం'
సిద్దిపేట జిల్లా మిరుదొడ్డిలో మంత్రి హరీశ్‌రావు పర్యటించారు. మొక్కజొన్న దిగుబడిని పరిశీలించారు. రైతులతో మాట్లాడి... వారి అనుమానాలు నివృత్తి చేశారు. ఎలాంటి ఆందోళన చెందవద్దని భరోనా ఇచ్చారు.
minister harish rao about corn farmers
కేంద్ర ప్రభుత్వం ఆఫ్రికా నుంచి మక్కలు తీసుకొచ్చి కోళ్లకు పోస్తానని చెబుతోందని హరీశ్ అన్నారు. కష్టపడి రైతులు మక్కలు పండిస్తే... వాటికి మద్దతు ధర రాకుండా భాజపా ప్రభుత్వం ఫారిన్ నుంచి తీసుకొస్తామంటోందని ఆరోపించారు. యాసంగిలో పండిన ప్రతీ గింజను రాష్ట్ర ప్రభుత్వం కొన్నదని.... ఈసారి కూడా కొంటుందని మంత్రి హామీ ఇచ్చారు. మొక్కజొన్న రైతుల సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి... పరిష్కారం చూపుతామని తెలిపారు.
ఇదీ చూడండి: పంట కోతలకు ఇక్కట్లు.. రైతులకు భారంగా మారనున్న ఖర్చులు
Last Updated : Oct 10, 2020, 3:17 PM IST