తెలంగాణ

telangana

ETV Bharat / state

గల్ఫ్​లో మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి పరామర్శ - one man died in gulf country

గల్ఫ్​ దేశంలో గుండెపోటుతో మృతి చెందిన వ్యక్తి కుటుంబాన్ని గల్ఫ్​ తెలంగాణ వెల్ఫేర్​ అసోసియేషన్​ అధ్యక్షుడు బసంత్​రెడ్డి పరామర్శించారు. సిద్దిపేట జిల్లా రామక్కపేటకు చెందిన రాజు కుటుంబాన్ని పరామర్శించి మృతికి గల కారణాలను తెలుసుకున్నారు.

gulf-telangana-welfare-association-president-consolation-to-gulf-victim-family-in-siddipet-district
గల్ఫ్​లో మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి పరామర్శ

By

Published : May 10, 2020, 9:38 PM IST

ఇటీవల గల్ఫ్ దేశంలో గుండెపోటుతో మృతి చెందిన వ్యక్తి కుటుంబాన్ని గల్ఫ్ తెలంగాణ వెల్ఫేర్ అండ్ కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షుడు బసంత్ రెడ్డి పరామర్శించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రామక్కపేట గ్రామానికి చెందిన రాజు అనే యువకుడు బ్రతుకుదెరువు కోసం గల్ఫ్ దేశం వెళ్లగా... కొద్ది రోజుల క్రితం అక్కడ గుండెపోటుతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న గల్ఫ్ తెలంగాణ వెల్ఫేర్ అండ్ కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షుడు బసంత్ రెడ్డి మృతుడి కుటుంబాన్ని పరామర్శించి మృతికి గల కారణాలను తెలుసుకున్నారు.

అనంతరం ప్రభుత్వ సహాయ సహకారాలతో మృతదేహాన్ని ఇండియాకు తెప్పిస్తామని అన్నారు. మృతుని కుటుంబ పరిస్థితి దయనీయంగా ఉందని.. వీరిని ప్రభుత్వం ఎలాగైనా ఆదుకోవాలని అన్నారు. మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు.

ఇవీ చూడండి:యాదాద్రి భువనగిరి జిల్లాలో కరోనా కలకలం

ABOUT THE AUTHOR

...view details