సిద్దిపేటలో ప్రజాస్వామ్యం ఉందో లేక నిజాం రాజ్యం నడుస్తోందో అర్థం కావడంలేదని మాజీ ఎంపీ, భాజపా నేత విజయశాంతి అన్నారు. ప్రభుత్వ ఆసుప్రతిలో పరిస్థితులను పరిశీలించడానికి వెళ్లిన మహిళా మోర్చా నాయకురాళ్లపై డిజాస్టర్ మేనేజ్‌మోంట్ యాక్ట్ కింద కేసులు పెట్టడమేంటని ప్రశ్నించారు.
వారిపై కేసులు పెట్టడం దారుణం: విజయశాంతి - ex mp vijayashanti latest news
రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను ఉల్లంఘించిన వారిలో ఎంత మందిపై కేసులు పెట్టి కోర్టు ముందు హాజరుపరుస్తున్నారో చెప్పాలని మాజీ ఎంపీ, భాజపా నేత విజయశాంతి డిమాండ్ చేశారు. సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో కొవిడ్ పరిస్థితులను పరిశీలించడానికి వెళ్లిన తమ పార్టీ మహిళా నేతలపై కేసులు పెట్టడం దారుణమని అన్నారు.

తెరాసపై విజయశాంతి విమర్శలు
రాష్ట్రంలో రోజూ లాక్‌డౌన్‌ను ఉల్లంఘిస్తున్న వారిలో ఎంతమందిపై కేసులు పెట్టి కోర్టులో హాజరుపరుస్తున్నారో చెప్పాలని విజయ శాంతి అన్నారు. పీపీఈ కిట్ ధరించకుండా గాంధీ, ఎంజీఎంలో తిరిగిన ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చి... ఖర్చు పరిమితిని రూ. 2 లక్షల నుంచి 5 లక్షలకు పెంచాలని విజ్ఞప్తి చేశారు.