పంట దిగుబడి ఆశించినంత రాలేదని మనస్తాపంతో యువరైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం జలిగావ్ గ్రామానికి చెందిన బరిగల రవి (25) తనకున్న రెండెకరాల భూమిలో పత్తి, వరి పంటలను సాగు చేశాడు. దిగుబడులు ఆశించిన స్థాయిలో రాకపోవడంతో పాటు పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదని మనస్థాపానికి గురయ్యాడు. సోమవారం రాత్రి ఇంట్లో అందరూ నిద్రించిన సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తెల్లవారుజామున కుటుంబ సభ్యులు లేచి చూసేసరికి అతను మృతి చెందాడు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గజ్వేల్ సీఐ ఆంజనేయులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఉరేసుకుని యువరైతు ఆత్మహత్య - farmer suicide
పంట దిగుబడి రాలేదనే మనస్తాపంతో ఓ యువరైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లా జలిగావ్ గ్రామంలో జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
ఉరేసుకుని యువరైతు ఆత్మహత్య