తెలంగాణ

telangana

ETV Bharat / state

అటవీ పునరుద్ధరణకు పోలీసుల సహకారం అందిస్తాం: డీజీపీ

సిద్దిపేట జిల్లా గజ్వేల్​ నియోజకవర్గంలో... పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులతో కలిసి డీజీపీ మహేందర్ రెడ్డి పర్యటించారు. నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి, అటవీ అభివృద్ధి పనులు, కొండపోచమ్మ జలాశయం ఆర్​అండ్​ఆర్​ కాలనీ నిర్మాణం, మిషన్ భగీరథ భవనం సందర్శించారు.

By

Published : Nov 19, 2020, 5:01 AM IST

dgp mahendar reddy said police support to reforestration
అటవీ పునరుద్ధరణకు పోలీసుల సహకారం అందిస్తాం: డీజీపీ


ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన తెలంగాణకు హరితహారం కేవలం అటవీశాఖ మాత్రమే కాకుండా... ముఖ్యమంత్రి పిలుపు మేరకు అన్ని ప్రభుత్వ శాఖలు భాగస్వామ్యం అయ్యాయని డీజీపీ మహేందర్రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్రంలోని సీనియర్ ఐపీఎస్ అధికారులతో కలిసి సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో పర్యటించి అటవీ పునరుద్ధరణ పనులను పరిశీలించారు.

అటవీ పునరుద్ధరణకు పోలీసుల సహకారం అందిస్తాం: డీజీపీ
గజ్వేల్ ప్రాంతంలో అటవీ పునరుద్ధరణ కార్యక్రమం భేషుగ్గా ఉందని మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. అడవుల పునరుద్ధరణ, కొండపోచమ్మ జలాశయం ఆర్​అండ్​ఆర్ కాలనీ నిర్మాణం, గజ్వేల్ పట్టణంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, మిషన్ భగీరథ పథకాన్ని పరిశీలించారు. అటవీ పరిశోధన కేంద్రం స్థాపన వల్ల శాస్త్రీయంగా, వేగంగా అడవులను పునరుద్ధరణ జరుగుతుందన్నారు. ప్రభుత్వం, అటవీశాఖ నిబద్ధతతో అటవీ విస్తీర్ణం పెంచేందుకు కృషి చేస్తున్నాయన్నారు. జిల్లా యంత్రాంగం అద్భుత సహకారం అందిస్తుందని కితాబునిచ్చారు.

అడవుల ప్రాధాన్యత, ఆవశ్యకత దృష్ట్యా... అడవులు పునరుద్ధరణకు పోలీస్ అధికారులు క్షేత్రస్థాయిలో సంపూర్ణ సహకారం అందేలా చూస్తామని డీజీపీ తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంకట్రామా రెడ్డి, పోలీస్ కమీషనర్ జోయల్ డేవిస్, జిల్లా అటవీ శాఖ అధికారి శ్రీధర్ రావు, గజ్వేల్ ఏరియా డెవలప్​మెంట్ అధికారి ఇ ముత్యంరెడ్డి, డీఆర్​డీవో విజయేందర్ రెడ్డి, గజ్వేల్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రామారావు, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:జీహెచ్‌ఎంసీలో వరదసాయానికి ఎస్ఈసీ బ్రేక్‌

ABOUT THE AUTHOR

...view details