తెలంగాణ

telangana

ETV Bharat / state

' త్వరలో ఇంటింటికీ సీఎన్​జీ గ్యాస్​ కనెక్షన్లు' - సీఎన్​జీ గ్యాస్​ తాజా వార్త

అతి త్వరలో సిద్దిపేట పట్టణంలో ఇంటింటికి టొరెంట్ సీఎన్​జీ గ్యాస్ కనెక్షన్లు రానున్నాయని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​ రావు అన్నారు. లింగారెడ్డి పల్లి గ్రామ శివారులో ఏర్పాటు చేసిన టొరెంట్ సీఎన్​జీ గ్యాస్ పంప్ స్టేషన్​ను ఆయన ప్రారంభించారు.

cng gas filling station inaugurated by minister harishrao
' త్వరలో ఇంటింటికీ సీఎన్​జీ గ్యాస్​ కనెక్షన్లు'

By

Published : Jan 5, 2020, 2:48 PM IST

సిద్దిపేట జిల్లా లింగారెడ్డి పల్లి గ్రామ శివారులో ఏర్పాటు చేసిన టొరెంట్​ సీఎన్​జీ గ్యాస్​ పంప్​ స్టేషన్​ను ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​ రావు ప్రారంభించారు. సిద్దిపేటలో టొరెంట్ సీఎన్​జీ గ్యాస్ ద్వారా ఇళ్లకు కలెక్షన్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు. కాలుష్యం బారిన పడకుండా ఉండాలి అంటే గ్యాస్​తో నడిచే వాహనాలు రావాలన్నారు.

సిద్దిపేటతో పాటు మెదక్, సంగారెడ్డి జిల్లాలో కూడా గ్యాస్ స్టేషన్లు ఏర్పాటు చేస్తామన్నారు. పెట్రోల్ డీజిల్​తో నడిచే వాహనాలు ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది కాబట్టి సీఎన్​జీ గ్యాస్​తో నడిచే వాహనాలు వాడాలన్నారు. దీని ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుందన్నారు. త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ఇవ్వబోతున్న డబుల్ బెడ్ రూమ్​ ఇళ్లకు ఈ గ్యాస్ కలెక్షన్ ఇచ్చి రాష్ట్రంలోనే జిల్లాను మొదటి స్థానంలో నిలుద్దామఅన్నారు. దీనికి పట్టణ ప్రజలు అందరూ సహకరించాలని కోరారు.

' త్వరలో ఇంటింటికీ సీఎన్​జీ గ్యాస్​ కనెక్షన్లు'
ఇవీ చూడండి : అప్పు ఇవ్వలేదని.. స్నేహితుడిని చంపేశారు

ABOUT THE AUTHOR

...view details