సీఏ కోర్సులో ఉత్తీర్ణత అంటే చిన్న విషయం కాదు. చదవడమే కాదు చివరి వరకు నిలబడగలిగే సహనం, పట్టుదల ఉండాలి. ఏ కోచింగ్ సెంటర్‌కు వెళ్లాలో... ఏ పుస్తకం చదవాలనే సందిగ్ధంలో కొందరు విద్యార్థులు ఏళ్ల తరబడి అలాగే మిగిలిపోతున్నారు. కానీ, కచ్చితమైన ప్రణాళిక ఉంటే మెుదటి ప్రయత్నంలోనే ఉత్తీర్ణత సాధించవచ్చని నిరూపిస్తోంది సిద్దిపేట జిల్లా గజ్వేల్‌కు చెందిన వెన్నెల.
మానసిక సంసిద్ధత ఉంటే సీఏ కచ్చితంగా సాధించవచ్చు: సీఏ ర్యాంకర్
యువతను ఊరించే ఉపాధి మార్గం సీఏ కోర్సు. అది ఎంత కష్టతరమో చదవడం ప్రారంభిస్తే కానీ తెలియదు. ఏ పుస్తకం చదవాలో తెలియని ఈ కోర్సు కోసం ఉత్తీర్ణత సాధించే వరకు ఏళ్ల తరబడి చదువుతునే ఉంటారు. కానీ గజ్వేల్‌కు చెందిన వెన్నెల పక్కా ప్రణాళికతో చదివి జాతీయ స్థాయిలో ఐదో ర్యాంకు సాధించింది. మానసిక సంసిద్ధత ఉంటే కచ్చితంగా సాధించవచ్చని ఆమె చెబుతోంది.
సీఏ ర్యాంకర్‌తో ముఖాముఖి, తెలంగాణ సీఏ ర్యాంకర్
ఇష్టంగా చదివినందుకే జాతీయ స్థాయిలో ఐదవ ర్యాంకు సాధించానని చెబుతోంది. మానసిక సంసిద్ధత ఉంటే కచ్చితంగా సాధించవచ్చని అంటోంది. సీఏ తప్ప మరో మార్గం లేదన్న ఏకైక లక్ష్యంతో ముందుకెళ్తే విజయం తప్పక వరిస్తుందంటున్న వెన్నెలతో ఈటీవీ భారత్ ముఖాముఖి.
ఇదీ చదవండి:నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది దుర్మరణం