సంగారెడ్డి జిల్లా బొల్లారం మున్సిపల్ ఛైర్మన్గా ఓటు వేయాల్సిన చంద్రారెడ్డికి బదులుగా తెరాసకు చెందిన తొమ్మిది మంది సభ్యులు అదే పార్టీకి చెందిన రోజా రాణికి ఓటు వేసి బలపర్చారు. ఎన్నికకు ముందు విప్ జారీచేసినా దాన్ని ధిక్కరించి రోజా రాణికి ఓటు వేశారని 17వ వార్డు సభ్యులు హనుమంత్ రెడ్డి ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు.
'విప్ నోటీసులు అందలేదు.. అందుకే చర్యలు తీసుకోలేం' - సంగారెడ్డి జిల్లా బొల్లారం మున్సిపల్ ఎన్నికల విచారణ
సంగారెడ్డి జిల్లా బొల్లారం మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికలో జారీచేసిన విప్పై రిటర్నింగ్ అధికారి విచారణ నిర్వహించారు. వార్డు సభ్యులు చేసింది ధిక్కారం కిందకు రాదని తేల్చారు.
'విప్ నోటీసులు వారికి అందనందున చర్యలు తీసుకోలేం'
ఈ విషయంపై ఆర్వో రమేష్ విచారణ నిర్వహించారు. విప్ నోటీసులు వారికి అందలేదని... వారి ఇళ్లకు అతికించినట్లు 9వ వార్డు సభ్యులు సంజాయిషీ ఇచ్చారని రమేష్ తెలిపారు. ఇది ఒప్పుకునే విధంగానే ఉందని ఆర్వో వెల్లడించారు. అందువల్ల తొమ్మిది మంది వార్డు సభ్యులపై ఎటువంటి చర్యలు ఉండవని రమేష్ స్పష్టం చేశారు.
ఇవీ చూడండి:నేడు రాష్ట్రస్థాయి పురపాలక సదస్సు