తెలంగాణ

telangana

ETV Bharat / state

ఓటు హక్కు వినియోగించుకోవాలంటూ అవగాహన ర్యాలీ - voter awareness rally in sangareddy

ఓటు హక్కును ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలంటూ సంగారెడ్డి జిల్లాలో కలెక్టర్ హనుమంతరావు ఓటరు అవగాహన ర్యాలీని నిర్వహించారు.

voter-awareness-rally-in-sangareddy-by-collector-hanumantharao
ఓటు హక్కు వినియోగించుకోవాలంటూ అవగాహన ర్యాలీ

By

Published : Jan 17, 2020, 3:23 PM IST

ఓటు హక్కును వినియోగించుకోవడం ప్రతి పౌరుని బాధ్యతని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. పట్టణాల్లో ఓటరు శాతం పెంచేలా ఇప్పటికే అవగాహన సదస్సులు, ర్యాలీలు చేపట్టామన్నారు.

మున్సిపాలిటీ ఆధ్వర్యంలో సంగారెడ్డి ఐబీ నుంచి పాత బస్టాండ్ వరకు నిర్వహించిన ఓటరు అవగాహన ర్యాలీలో కలెక్టర్ పాల్గొన్నారు. ఓటు హక్కుపై చేపడుతున్న అవగాహన కార్యక్రమాల్లో ప్రజలందరూ భాగస్వాములు కావాలని హనుమంతరావు కోరారు.

పురపాలిక ఎన్నికల్లో ఎలాంటి ప్రలోభాలకు లోనవకుండా.. సమర్థవంతమైన నాయకుడిని ఎన్నుకోవాలని ప్రజలను కోరారు.

ఓటు హక్కు వినియోగించుకోవాలంటూ అవగాహన ర్యాలీ

ఇవీ చూడండి: పురపోరుకు సై అంటున్న రియల్టర్లు

ABOUT THE AUTHOR

...view details