తొమ్మిది మంది తెరాస వార్డు సభ్యులకు షోకాజ్ నోటీసులు - Sangareddy municipality
18:02 February 09
తొమ్మిది మంది తెరాస వార్డు సభ్యులకు షోకాజ్ నోటీసులు
సంగారెడ్డి జిల్లా ఐడిఏ బొల్లారం మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికల్లో తెరాస జారీ చేసిన విప్ ధిక్కరించిన 9 మంది వార్డు సభ్యులకు అధికారులు.. షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వారం రోజుల్లో సంజాయిషీ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు.
బొల్లారం మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికలో తెరాస రెండు వర్గాలుగా విడిపోయింది. పార్టీ సూచించిన అభ్యర్థిని కాకుండా వేరే అభ్యర్థికి తొమ్మిది మంది సభ్యులు మద్దతు తెలిపారు. అంతకు ముందు స్థానిక ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి... కౌన్సిర్లకు విప్ జారీ చేశారు. అయినా వారు విప్‌ను లెక్కచేయకుండా రోజా రాణి అనే సభ్యురాలిని ఛైర్మన్‌గా ఎన్నుకున్నారు.
ఇవీ చూడండి:మేడారం జాతరలో కృత్రిమ మేధ సఫలీకృతం