తెలంగాణ

telangana

By

Published : Nov 19, 2019, 11:59 PM IST

ETV Bharat / state

జహీరాబాద్​ రైల్వే స్టేషన్​లో ద.మ.రైల్వే జీఎం

ప్రయాణికులకు అనుకూలంగా రైల్వే సేవలను మరింత విస్తరిస్తామని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మల్యా అన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో ఆధునికీకరించిన ఆదర్శ రైల్వేస్టేషను ఆయన సందర్శించారు.

జహీరాబాద్​ రైల్వే స్టేషన్​లో ద.మ.రైల్వే జీఎం

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని ఆదర్శ రైల్వేస్టేషన్​ను దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్​ మల్యా సందర్శించారు. స్టేషన్​ ఆవరణలో కొత్తగా ఏర్పాటు చేసిన నేచురల్ పార్కులో మొక్కలు నాటారు. మురుగు నీటిని శుద్ధి చేసే ట్రీట్మెంట్ ప్లాంట్​ను రైల్వే అధికారులతో కలిసి ప్రారంభించారు. పట్టణం మీదుగా అదనపు రైళ్లను నడపాలని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు రైల్వే జీఎంకు విజ్ఞప్తి చేశారు. బీదర్-ముంబై, బీదర్ -గుల్బర్గా, వికారాబాద్- అజ్మీర్ రైళ్లను జహీరాబాద్ వరకు నడపాలని కోరారు. 65 నంబర్ జాతీయ రహదారిపై గతంలో ప్రతిపాదించిన లింగంపల్లి-సంగారెడ్డి-సదాశివపేట-జహీరాబాద్ రైలు మార్గాన్ని నిర్మించేలా చూడాలని కోరారు.

జహీరాబాద్​ రైల్వే స్టేషన్​లో ద.మ.రైల్వే జీఎం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details