సీనియర్ పాత్రికేయులు పొన్నాల గౌరీశంకర్ చేపట్టిన సైకిల్ యాత్ర సంగారెడ్డి జిల్లా పటాన్చెరుకు చేరుకుంది. అందులో భాగంగానే శ్రీ రామలింగేశ్వర ఆలయం ఆవరణలో గౌరీ శంకర్ ఒక మొక్క నాటారు. రాష్ట్రంలో అవినీతి రహిత పాలన అందించాలని, ప్రజావాణిలో ముఖ్యమంత్రి అందుబాటులో ఉండాలని ఆయన కోరారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా ఉన్నాయని ఆయన తెలిపారు.
పటాన్చెరు చేరుకున్న గౌరీశంకర్ సైకిల్ యాత్ర - senior journalist Gouri shankar Cycle Tour
తెలుగును పరిపాలనా భాషగా అమలు చేయాలని అలాగే పర్యావరణ పరిరక్షణ చేపట్టాలని కోరుతూ సీనియర్ పాత్రికేయులు పొన్నాల గౌరీశంకర్ చేపట్టిన సైకిల్ యాత్ర పటాన్చెరుకు చేరుకుంది.

పటాన్చెరు చేరుకున్న గౌరీశంకర్ సైకిల్ యాత్ర
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రహదారులకు ఇరువైపులా ఔషధ, పండ్ల మొక్కలు నాటించాలని గౌరీ శంకర్ తెలిపారు. అలాగే పర్యావరణ పరిరక్షణకు కూడా నడుం కట్టాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నారు. తెలుగును పరిపాలనా భాషగా అమలు చేయాలని కోరుతూ 29 రాష్ట్రాల్లో ఆయన చేపట్టిన సైకిల్ యాత్ర విజయవంతం అయిందని తెలిపారు.
పటాన్చెరు చేరుకున్న గౌరీశంకర్ సైకిల్ యాత్ర
ఇవీ చూడండి:మారుతీరావు అంత్యక్రియలకు అమృత దూరం...!