తెలంగాణ

telangana

ETV Bharat / state

కంటైన్మంట్‌ ప్రాంత ప్రజలపై కలెక్టర్‌ అసహనం

సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లోని ఏడో కంటైన్మంట్‌ ప్రాంతంలో కలెక్టర్‌ హనుమంతరావు పర్యటించారు. అకారణంగా బయట తిరుగుతున్న వారిపై అసహనం వ్యక్తం చేశారు. లాక్‌డౌన్‌ ఉల్లంఘనను అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

sanga reddy collector
సంగారెడ్డి కలెక్టర్‌

By

Published : Apr 16, 2020, 9:57 AM IST

సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ మున్సిపల్ పరిథిలో ఏడో కంటైన్మెంట్ ప్రాంతమైన సాయికృపా నగర్‌, రామచంద్రాపురం, మయూరి నగర్ కాలనీలను జిల్లా పాలనాధికారి హనుమంతరావు పరిశీలించారు. అక్కడి పరిస్థితులను స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిర్లక్ష్యంగా బయట తిరుగుతున్న వారిపై కలెక్టర్‌ అసహనం వ్యక్తం చేశారు. అనవసరంగా ప్రజలు బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు. లాక్‌డౌన్‌ ఉల్లంఘనలను అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

కంటైన్మెంట్ ప్రాంతంలో ప్రజలకు అందుతోన్న సౌకర్యాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. కరోనా కట్టడిలో అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.


ఇదీ చదవండి:ఏపీ ముఖ్యమంత్రి నివాసానికి కరోనా ఎఫెక్ట్

ABOUT THE AUTHOR

...view details