తెలంగాణ

telangana

ETV Bharat / state

'ప్లాస్టిక్ నిషేధంపై యుద్దం ప్రకటించాల్సి సమయం ఆసన్నమైంది'

ఈనాడు-ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఒక్కరు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి.. పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని వక్తలు ఆకాంక్షించారు.

'ప్లాస్టిక్ నిషేధంపై యుద్దం ప్రకటించాల్సి సమయం ఆసన్నమైంది'

By

Published : Oct 5, 2019, 7:36 PM IST

ప్లాస్టిక్ వాడకం ద్వారా పర్యావరణం విషతుల్యమవడమే కాకుండా... మానవ మనుగడే ప్రశ్నార్థకం అవుతుందని సంగారెడ్డి జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్లు అన్నారు. పట్టణంలోని పరిషత్ కార్యాలయంలో ఈనాడు-ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో నిర్వహించిన "ప్లాస్టిక్ నిషేధం" కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ప్లాస్టిక్ వాడకం ద్వారా 27 రకాల క్యాన్సర్లు వచ్చే ఆవకాశం ఉందని.. ఇప్పటికైనా యుద్ధం ప్రకటించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. 30 రోజుల ప్రత్యేక ప్రణాళికలో భాగంగా ప్లాస్టిక్ నిషేధంపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించామని.. ఈ కార్యక్రమాన్ని ఈనాడు-ఈటీవీ భారత్ చేపట్టడం సంతోషంగా ఉందని వెంకటేశ్వర్లు తెలిపారు.

'ప్లాస్టిక్ నిషేధంపై యుద్దం ప్రకటించాల్సి సమయం ఆసన్నమైంది'

ABOUT THE AUTHOR

...view details