సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మూడుశాఖల అధికారులతో శాఖలవారీగా సమీక్ష నిర్వహించారు. పటాన్చెరు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగంగా పూర్తి చేయాలని రోడ్లు-భవనాల శాఖ, పంచాయతీ రాజ్, నీటిపారుదల శాఖ అధికారులకు ఆయన సూచించారు. అలాగే పనులను పూర్తి చేయని కాంట్రాక్టర్లపై చర్యలు చర్యలు తీసుకుని, బ్లాక్ లిస్టులో పెట్టాలని ఆయన ఆదేశించారు. కరోనా కట్టడిలో అధికారుల పాత్ర ప్రశంసనీయమన్నారు.
అభివృద్ధి పనులపై అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష - sangareddy district
సంగారెడ్డి పటాన్చెరులో ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి రోడ్లు-భవనాల శాఖ, పంచాయతీ రాజ్, నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. నియోజకర్గంలో అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
అభివృద్ధి పనుల్లో జాప్యం లేకుండా చూడాలని, నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడవద్దని ఆయన సూచించారు. టెండర్లు పూర్తయినా.. పనులను ప్రారంభించడంలో నిర్లక్ష్యం వహించిన కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలన్నారు. మండల స్థాయిలో ఎంపీపీ, జడ్పీటీసీలు, సంబంధిత అధికారులతో ఎప్పటికప్పుడు అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశాలు నిర్వహించాలని అన్నారు . నియోజకవర్గంలో పూర్తయిన అభివృద్ధి పనుల వివరాలను నివేదిక రూపంలో అందించాలని, వీటిని త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు.
ఇవీ చూడండి: ప్రయాణికుల రైళ్లను అప్పుడే పునరుద్ధరించొద్దు: కేసీఆర్