తెలంగాణ

telangana

ETV Bharat / state

'పరిసరాల శుభ్రత వల్లే ఆరోగ్యకర సమాజం సాధ్యం' - corona effect

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరులోని ఎమ్మెల్యే మహిపాల్​ రెడ్డి నివాసంలో పరిసరాల శుభ్రత కార్యక్రమం నిర్వహించారు. మంత్రి కేటీఆర్​ ఇచ్చిన పిలుపు మేరకు చేపట్టిన ఈ కార్యక్రమంలో దోమల నివారణ చేపట్టారు.

patancheru mla cleaning environments
'పరిసరాల శుభ్రత వల్లే ఆరోగ్యకర సమాజం సాధ్యం'

By

Published : May 10, 2020, 3:03 PM IST

మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పరిసరాలు శుభ్రం చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్​చెరులోని ఎమ్మెల్యే నివాసంలో గ్రేటర్ ఉప కమిషనర్ బాలయ్య ఆధ్వర్యంలో దోమల నివారణ చేపట్టారు. దోమల వ్యాప్తిని అరికట్టే విధంగా ప్రతి ఒక్కరు శుభ్రత పాటించాలని ఎమ్మెల్యే కోరారు.

ప్రతి ఆదివారం శుభ్రత కార్యక్రమాలు చేపట్టి ఆరోగ్యకర సమాజాన్ని నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. పరిసరాల పరిశుభ్రత వల్లే ఆరోగ్యవంతమైన సమాజం నిర్మితమవుతుందని తెలిపారు.

ఇదీ చూడండి:కడియం ఫౌండేషన్ ఆధ్వర్యంలో సరుకుల పంపిణీ

ABOUT THE AUTHOR

...view details