సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో కొనసాగుతున్న పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ఎమ్మెల్యే మాణిక్‌రావు ద్విచక్రవాహనంపై తిరుగుతూ పర్యవేక్షించారు. పట్టణంలోని హౌసింగ్ బోర్డు, శాంతినగర్, సంతోష్ నగర్, నలంద కాలనీల్లో పర్యటించిన ఎమ్మెల్యే స్థానికులతో మాట్లాడి పలు సమస్యల వివరాలు తెలుసుకున్నారు.
పట్టణ ప్రగతిలో స్కూటర్‌పై ఎమ్మెల్యే మాణిక్‌రావు హల్చల్ - latest news on mla manik rao
పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా జహీరాబాద్‌లోని పలు కాలనీల్లో ఎమ్మెల్యే మాణిక్‌రావు పర్యటించారు. గుర్తించిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

పట్టణ ప్రగతి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే మాణిక్‌రావు
ప్రత్యేక అధికారులతో మాట్లాడి పట్టణంలో గుర్తించిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా పట్టణ ప్రగతిలో చేసిన పలు పనుల వివరాల రికార్డులను ఎమ్మెల్యే పరిశీలించారు. ప్రతి ఒక్కరూ పట్టణ ప్రగతిలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
పట్టణ ప్రగతి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే మాణిక్‌రావు
ఇదీ చూడండి:ఆ గుడిలో మహిళలే పూజారులు.. కారణం ఇదే..!