తెలంగాణ

telangana

ETV Bharat / state

బండరాయితో మోది వ్యక్తి దారుణ హత్య - man brutally murdered

సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో వ్యక్తి దారుణ హత్య స్థానికంగా కలకలం రేపింది. గుర్తుతెలియని వ్యక్తులు బండరాయితో మోది దారుణంగా హతమార్చారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

man brutally murdered with a rock in Ameenpur, sangareddy district
బండరాయితో మోది వ్యక్తి దారుణ హత్య

By

Published : Aug 31, 2020, 3:44 AM IST

సంగారెడ్డి జిల్లా అమీన్పూర్​లో ఆదివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. స్థానికులు అందించిన సమాచారం మేరకు సంఘటనా స్థలాకి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. మృతుడు అమీన్​పూర్​కు చెందిన సాయికుమార్​గా గుర్తించారు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు బండరాయితో మోది హత్య చేసినట్లు వెల్లడించారు.

మృతుడు తరుచూ మద్యం తాగుతూ స్నేహితులతో తిరిగేవాడని ఈ నేపథ్యంలో ఎవరితోనైనా గొడవ పడటంతో హత్య చేసి ఉండవచ్చునని అనుమానం వ్యక్తమవుతోంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పటాన్​చెరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీచూడండి:జనాభా లెక్కలు ఈ ఏడాది లేనట్టే!

ABOUT THE AUTHOR

...view details