సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణానికి చెందిన కరోనా సోకిన ఓ వ్యక్తి చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. మృతదేహాన్ని అధికారులు కొవిడ్ నిబంధనల ప్రకారం ఖననం చేశారు.
సంగారెడ్డిలో కరోనా కలకలం.. కొత్తగా 13 కేసులు - corona cases in sangareddy
హైదరాబాద్ నగరాన్ని ఆనుకుని ఉన్న సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో ఓ కరోనా బాధితుడు చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. కాగా కొత్తగా 13 మందికి పాజిటివ్ నిర్ధరణ అయ్యింది.
సంగారెడ్డిలో కరోనా కలకలం.. కొత్తగా 13 కేసులు నమోదు
అలాగే నియోజవర్గంలోని పటాన్చెరు పట్టణం, ముత్తంగి, ఇస్నాపూర్, బీడీఎల్, చెట్ల పోతారం వంటి ప్రాంతాల్లో ఒక్కొక్క కేసు చొప్పున నమోదవగా జిన్నారం మండలం దోమడుగు, రామచంద్రపురం పరిధిలో మూడేసి కేసులు చొప్పున నమోదయ్యాయి. అమీన్పూర్ మున్సిపాలిటీలో రెండు కేసులు నమోదు అయ్యాయి. కాగా కొత్తగా 13 మందికి వైరస్ నిర్ధరణ అయిందని వైద్య అధికారులు వెల్లడించారు.
ఇదీ చదవండి:హోం క్వారంటైన్లో ఉన్నవారికి కరోనా కిట్లు