ఐఐటీ హైదరాబాద్ పరిశోధకులు డీఎన్ఏను తిరిగి బాగు చేసే వ్యవస్థ గుట్టు విప్పారు. డీమిథైలైజేషన్ ప్రక్రియ ద్వారా ఏఎల్‌కేబీహెచ్3 ప్రొటీన్ దెబ్బతిన్న డీఎన్‌ఏను మరమ్మత్తు చేస్తుందని వీరు గుర్తించారు. ఇది ఆర్‌ఏడీ51సీ అనే మరో ప్రొటీన్‌తో కలిసి పనిచేస్తుందని వీరి పరిశోధనలో తేలింది. ఈ రెండు ప్రొటీన్లు కలవడం వల్ల డీఎన్‌ఏను బాగుచేయడం సాధ్యమవుతోందని పేర్కొన్నారు.
డీఎన్ఏను బాగుచేయడం సాధ్యం : ఐఐటీ హైదరాబాద్ - డీఎన్ఏను తిరిగి బాగు చేసే వ్యవస్థ
ప్రతి జీవిలోనూ డీఎన్ఏ కీలక పాత్ర పోషిస్తుంది. శరీరంలో ఉత్పత్తి అయ్యే కొన్ని రసాయనాల ప్రభావంతో డీఎన్ఏ నిర్మాణం దెబ్బతింటుంది. ఈ నేపథ్యంలో తిరిగి బాగు చేసే వ్యవస్థను ఐఐటీ హైదరాబాద్ పరిశోధకులు కనుక్కున్నారు.
డీఎన్‌ఏను బాగుచేయడం సాధ్యం : ఐఐటీ హైదరాబాద్
ఐఐటీ హైదరాబాద్, ఐఐటీ గువాహటికి చెందిన ఆచార్యులు డాక్టర్ అనింద్యారాయ్, డాక్టర్ అరుణ్ గోయల్ సారధ్యంలోని బృందం ఈ పరిశోధన చేసింది. ఈ బృందం ప్రోస్టేట్ క్యాన్సర్‌కి మెరుగైన చికిత్సా పద్ధతులను అందుబాటులోకి తెచ్చే అంశమై గత కొంతకాలంగా పరిశోధనలు చేస్తోంది.
ఇదీ చూడండి : కోర్టులో సాయికుమార్గౌడ్పై నేరాభియోగపత్రం దాఖలు