రంగారెడ్డి జిల్లా మీర్పేట్ పీఎస్ పరిధి గుర్రంగూడలోని గడ్డం ఎన్క్లేవ్ కాలనీలో వరుసగా మూడు ఇళ్లలో చోరీ జరిగింది. నూతనంగా నిర్మించిన మరో నాలుగు ఇళ్ల తాళాలు కూడా పగులగొట్టారు. సంక్రాంతి పండుగకు సొంత ఊళ్లకు వెళ్లిన వారు తిరిగొచ్చేలోపు ఇళ్లను దోచేశారు దొంగలు. ఊరెళ్లి తిరిగొచ్చి చూసేలోపు తాళం పగులగొట్టి, ఇంట్లో ఉన్న వస్తువులన్నీ చెల్లాచెదురుగా పడి ఉన్నాయి.
పండుగకు ఊరెళితే... ఇళ్లను గుళ్ల చేశారు..!
సంక్రాంతి పండుగకు సొంత ఊళ్లకు వెళ్లిన వారు తిరిగొచ్చేలోపు ఇళ్లను గుళ్ల చేశారు దొంగలు. ఇంట్లో వస్తువులు చెల్లాచెదురుగా పడి ఉండటంతో పోలీసులను ఆశ్రయించారు బాధితులు.
పండుగకని ఊరెళ్తే... ఇంటిని గుల్ల చేశారు..!
దొంగతనం జరిగిందని గుర్తించిన యజమానులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి క్లూస్ టీంతో కలిసి ఆధారాలు సేకరించారు. మొత్తం నాలుగు తులాల బంగారు ఆభరణాలు, 70 వేల నగదును దుండగులు ఆపహరించారు.
ఇవీ చూడండి: పండగకి ఇంటికెళ్లి వచ్చేసరికి ఇళ్లు గుల్లైంది