సంక్రాంతి పండుగకు ఇళ్లకు వెళ్లిన వారు తిరిగొచ్చేలోపు ఇళ్లను గుల్ల చేశారు దొంగలు. అల్వాల్ పీఎస్ పరిధిలో ఉన్న నాలుగు ఇళ్లను దోచుకెళ్లారు. ఊరెళ్లి తిరిగొచ్చి చూసేలోపు తాళం పగులగొట్టి, ఇంట్లో ఉన్న వస్తువులన్నీ చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. దొంగతనం జరిగిందని గుర్తించిన యజమానులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి... క్లూస్ టీంతో కలిసి ఆధారాలు సేకరిస్తున్నారు.
ఇవీ చూడండి: బస్తీమే సవాల్: దుండిగల్లో దండిగా ఓట్లు పడేది ఏ పార్టీకి...?