తెలంగాణ

telangana

ETV Bharat / state

కందుకూరు వృద్ధురాలి హత్యకేసు 12 గంటల్లో ఛేదించిన పోలీసులు..

రంగారెడ్డి జిల్లా కందుకూరులో జరిగిన వృద్ధురాలి హత్యకేసును 12 గంటల్లోనే రాచకొండ పోలీసులు ఛేదించారు.  నిందితుడు కళ్యాణ్​కుమార్​ భవాంజిని అరెస్టు చేసి అతని వద్ద నుంచి సుమారు రూ. 1.23 లక్షల విలువచేసే బంగారు ఆభరణాలు, 10 తులాల వెండి స్వాధీనం చేసుకున్నారు.

By

Published : Jan 29, 2020, 2:05 PM IST

rachakonda cp mahesh bhagavath talk on kandukuru murder
కందుకూరు వృద్ధురాలి హత్యకేసు 12 గంటల్లో ఛేదించిన పోలీసులు..

రంగారెడ్డి జిల్లా కందుకూరు పొలీస్ స్టేషన్ పరిధిలో ఓ వృద్ధురాలు హత్య కేసును పోలీసులు ఛేదించారు. అదే ఊరిలోని కళ్యాణ్ కుమార్ భవాంజి అనే వ్యక్తిని నిందితుడుగా గుర్తించి అరెస్టు చేసినట్టు రాచకొండ సీపీ మహేశ్​ భగవత్​ తెలిపారు.
స్థానికంగా ఉండే బాలామణి అనే వృద్ధురాలి దగ్గర ఉన్న బంగారం కోసం ఆశపడి నిందితుడు ఈ అఘాయిత్యానికి ఒడిగట్టినట్టు పేర్కొన్నారు. మృతురాలు బాలామణి, నిందితుడి తల్లి ఇద్దరు స్నేహితులని ఆ చనువుతోనే ఆమె ఇంటికి వెళ్లి తనకు కల్లు తాగించాడు. అనంతరం గొంతు నులిమి చంపి ఆభరణాలు తీసుకుని ఆమె మృతదేహాన్ని కుమార్తె ఇంటి సమీపంలో పడేసాడని దర్యాప్తులో తేలిందని సీపీ చెప్పారు.
భవాంజి వద్ద నుంచి సుమారు రూ. 1.23 లక్షల విలువ చేసే ఆరు తులాల బంగారం, 10 తులాల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామని సీపీ పేర్కొన్నారు. వృద్ధులు ఆపదలో ఉన్నపుడు పోలీసు స్టేషన్​కి రావాల్సిన అవసరం లేదని.. ఫోన్ చేస్తే వారి ఇంటి వద్దకే వచ్చి ఫిర్యాదు తీసుకుంటామని మహేశ్​ భగవత్​ వెల్లడించారు.

కందుకూరు వృద్ధురాలి హత్యకేసు 12 గంటల్లో ఛేదించిన పోలీసులు..

ABOUT THE AUTHOR

...view details