బుధవారం మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో పోలింగ్ ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. పోలింగ్ బాక్స్‌లు, బ్యాలెట్ పత్రాలని సిద్ధం చేసి పోలింగ్ కేంద్రాలకు తరలించారు. పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న 24 వార్డులకి 63 పోలింగ్ కేంద్రాలలో 6 కేంద్రాలను సమస్యాత్మకంగా గుర్తించారు. 150 మంది పోలీసులతో బందోబస్తును ఏర్పాటు చేశారు.
ఇబ్రహీంపట్నంలో పుర పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి - MUNCIPAL ELECTIONS IN TELANGANA
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో పుర ఎన్నికల పోలింగ్‌కు అధికారులు అంతా సిద్ధం చేశారు. సుమారు 370 మంది ఎన్నికల సిబ్బందిని నియమించారు.
Poling Arrangements
ఇవీ చూడండి : 'మున్సిపల్ పోలింగ్ కోసం పటిష్ఠ బందోబస్తు'
Last Updated : Jan 22, 2020, 12:00 AM IST