తెలంగాణ

telangana

ETV Bharat / state

చేవెళ్లలో రాజకీయ కక్షలతో ఇరువర్గాల మధ్య ఘర్షణ - chevella

రాజకీయ కక్షలతో రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఇరువర్గాల వ్యక్తులు పరస్పర దాడులకు దిగారు. నిన్న పోలింగ్ ముగిసిన తరువాత ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో తెరాస తరపున సర్పంచ్​గా పోటీ చేసి ఓడిపోయిన నర్సింహులు తలకు తీవ్రగాయాలయ్యాయి.

పరస్పర దాడిలో గాయపడ్డ నరసింహులు

By

Published : Apr 12, 2019, 12:45 PM IST

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఘన్​పూర్​లో పాత కక్షలు భగ్గుమన్నాయి. గ్రామంలోని ఇరువర్గాల నాయకుల మధ్య నిన్న జరిగిన ఎన్నికల తర్వాత ఘర్షణ చోటు చేసుకుంది. మాజీ సర్పంచ్ రాంరెడ్డి, మరో సీనియర్ నాయకుడు గిరిధర్ రెడ్డి మధ్య కొంతకాలంగా రాజకీయపరంగా గొడవలు జరుగుతున్నాయి. ఈమధ్య కాలంలో ఆ కక్షలు మరింతగా పెరిగిపోయాయి. రాత్రి పోలింగ్ ముగిశాక ఇరువర్గాల వ్యక్తులు దాడులకు దిగారు. ఘటనలో తెరాస నాయకుడు నర్సింహులు తలకు తీవ్రగాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు అల్లర్లను అదుపులోకి తెచ్చారు. గ్రామంలో పికెటింగ్ ఏర్పాటు చేశారు.

పరస్పర దాడిలో గాయపడ్డ నరసింహులు

ABOUT THE AUTHOR

...view details