తెలంగాణ

telangana

ETV Bharat / state

'చేవెళ్ల హత్య ఘటన వివరాలు తెలిస్తే చెప్పండి'

రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్లలో దారుణ హత్యకు గురైన యువతి వివరాల సేకరణ కోసం పోలీసులు చర్యలు చేపట్టారు. ఎవరికైనా కేసుకు సంబంధించి వివరాలు తెలిస్తే నిర్భయంగా తమకు తెలియజేయాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

By

Published : Mar 17, 2020, 8:29 PM IST

ముమ్మర గాలింపులు చేపట్టిన చేవెళ్ల పోలీసులు
ముమ్మర గాలింపులు చేపట్టిన చేవెళ్ల పోలీసులు

చేవెళ్లలో దారుణ హత్యకు గురైన యువతి వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే పలు పోలీస్ స్టేషన్లకు సమాచారమిచ్చిన పోలీసులు... యువతి ఆచూకీ తెలపాలంటూ ప్రకటన విడుదల చేశారు. యువతి ఫొటో, ఆమెకు చెందిన వస్తువుల దృశ్యాలను విడుదల చేశారు. యువతిని గుర్తించిన వాళ్లు సమాచారమివ్వాల్సిందిగా చేవేళ్ల పోలీసులు కోరారు.

చేవెళ్ల ఏసీపీ, సీఐ, ఎస్సై లేదా ఠాణాకు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు. మృతదేహానికి చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రిలో శవపరీక్ష నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని భద్రపరిచారు. యువతి వివరాలు తెలిస్తే కేసులో పురోగతి లభించే అవకాశం ఉందంటున్నారు పోలీసులు.

ఇవీ చూడండి : రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు మృతి

ABOUT THE AUTHOR

...view details