పుర ఎన్నికల ప్రచారంలో రెబల్స్ ప్రచారం జోరు అందుకుంది. అధికార పార్టీలకు దీటుగా స్వతంత్ర అభ్యర్థులు ప్రచారం చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా జల్పల్లి మున్సిపాలిటీలోని 16 వార్డు నుంచి తెరాస రెబల్ బుడమాల యాదగిరి డప్పు వాద్యాల మధ్య ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ వార్డులో తెరాస, స్వతంత్ర అభ్యర్థులిద్దరే పోటీ చేస్తున్నారు. స్వతంత్ర అభ్యర్థి తరఫున జల్పల్లి మాజీ సర్పంచ్ కట్టెల రాములు ప్రచారం చేస్తున్నారు. తాను తెరాసలో ఉన్నప్పటికీ టికెట్ ఇవ్వలేదని... ప్రాంత అభివృద్ధి కోసం స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచినట్లు తెలిపారు.
మున్సిపాలిటీ 10 వ వార్డులోని సాలెహీన్ కాలనీ ప్రాంతంలో ఎంఐఎం అభ్యర్థి ఒమర్ బిన్ అజిజ్ బామ్ ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ... ఎంఐఎం పార్టీ గుర్తు గాలిపటానికి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. తాను గెలిచిన తరువాత వార్డులో ఉన్న అన్ని సమస్యలను పరిష్కరిస్తానని తెలిపారు.