తెలంగాణ

telangana

By

Published : Jan 2, 2020, 12:35 PM IST

ETV Bharat / state

తుర్కయంజాల్​ మున్సిపాలిటీ వివరాలు ఇవే!!

తుర్కయంజాల్​ మున్సిపాలిటీ ఆగస్టు రెండు 2018లో 9 గ్రామపంచాయతీల కలయికతో కొత్తగా ఏర్పడింది. మున్సిపాలిటీలో 50వేల 255 ఓటర్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

municipality-of-turkayamjal-details
తుర్కయంజాల్​ మున్సిపాలిటీ వివరాలు ఇవే!!

రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్​ మున్సిపాలిటీ ఆగస్టు రెండు 2018లో 9 గ్రామపంచాయతీల కలయికతో నూతనంగా ఏర్పడింది. మున్సిపాలిటీలో 50వేల 255 ఓటర్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

నగరానికి దగ్గరగా ఉండటం... సాగర్​ రహదారికి ఆనుకొని ఉండటంతో పట్టణీకరణ చాలా వేగవంతంగా జరిగింది. అందుకు తగ్గట్టుగా మౌలిక వసతులు లేకపోవడం వల్ల అంతర్గత రోడ్లు, డ్రైనేజీ, త్రాగునీరు, పారిశుద్ధ్యం వంటి సమస్యులు ఉన్నాయి. మున్సిపాలిటీ ఇరవై నాలుగు వార్డులుగా విభజించారు.

ఎన్నికల షెడ్యూల్​ విడుదల అయినప్పటికీ రిజర్వేషన్ల ఖరారు కాకపోవడం వల్ల ఆశావహులు అంతా అయోమయంలో ఉన్నారు. ఓవైపు నామినేషన్ల తేదీ ఖరారు చేసినప్పటికీ రిజర్వేషన్లు ఖరారు కాకపోవడం వల్ల ఆయా వార్డులలో ఏ రిజర్వేషన్లు వస్తాయో తెలియక ఆశావహుల్లో తీవ్ర ఉత్కంఠ పరిస్థితి నెలకొంది.

తుర్కయంజాల్​ మున్సిపాలిటీ వివరాలు ఇవే!!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details