తెలంగాణ

telangana

అధికారులే భూమిని ఆక్రమించారు.. హెచ్​ఆర్సీలో వృద్ధురాలు ఫిర్యాదు

By

Published : Feb 4, 2021, 5:41 AM IST

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం తహసీల్దార్​, గుమస్తా శేఖర్​ తన భూమిని ఆక్రమించుకున్నారని పోరండ్ల గ్రామానికి చెందిన గిద్దెల యాదమ్మ హెచ్​ఆర్సీని ఆశ్రయించింది. మహేశ్వరం పోలీసులకు ఫిర్యాదుచేసినా పట్టించుకోలేదని వాపోయింది.

hrc
అధికారులే భూమిని ఆక్రమించారు.. హెచ్​ఆర్సీలో వృద్ధురాలు ఫిర్యాదు

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం పోరండ్ల గ్రామానికి చెందిన గిద్దెల యాదమ్మకు.. కందుకూరు మండలం చిప్పేలపల్లిలో 14 ఎకరాల 11 గుంటల వ్యవసాయ భూమి ఉంది. దానిని కొందరు వ్యక్తులు ఆక్రమించుకున్నారని కమిషన్​ ముందు ఆవేదన వ్యక్తం చేసింది. మహేశ్వరం తహసీల్దార్​, అక్కడ పనిచేసే గుమస్తా శేఖర్​, పలువురు అధికారులు కుమ్మక్కైయ్యారని తెలిపింది. బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.

ఇదే విషయమై మహేశ్వరం పోలీసులకు ఫిర్యాదుచేసినా పట్టించుకోలేదని కమిషన్​ దృష్టికి తీసుకువచ్చింది. తనకు రక్షణ కల్పించాలని.. తన భూమిని తనకు ఇప్పించాలని కోరింది.

అధికారులే భూమిని ఆక్రమించారు.. హెచ్​ఆర్సీలో వృద్ధురాలు ఫిర్యాదు

ఇవీచూడండి:'ద.మ. రైల్వేలో మహిళా ఉద్యోగులది కీలకపాత్ర'

ABOUT THE AUTHOR

...view details