తెలంగాణ

telangana

ETV Bharat / state

'మంత్రులు మాయమాటలు చెప్పి మార్కెట్​ను తరలించారు' - koheda

కొహెడ పండ్ల మార్కెట్​ను భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరిశీలించారు. మంత్రులు మాయమాటలు చెప్పి మార్కెట్​ను తరలించారని ఎంపీ ఆరోపించారు. మార్కెట్​లో సర్కారు అరకొర సౌకర్యాలే కల్పించిందని విమర్శించారు.

mp-komatireddy-venkatreddy-visit-koheda-fruit-market
'మంత్రులు మాయమాటలు చెప్పి మార్కెట్​ను తరలించారు'

By

Published : May 4, 2020, 7:35 PM IST

Updated : May 4, 2020, 7:58 PM IST

రంగారెడ్డి జిల్లా కొహెడ పండ్ల మార్కెట్‌ను భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరిశీలించారు. పండ్ల వ్యాపారులు, రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నగరంలో జనసంద్రం ఎక్కువగా ఉన్న ప్రాంతం నుంచి పండ్ల మార్కెట్‌ని ఉన్నఫలంగా తరలించడానికి కారణం ఏంటని ఆయన నిలదీశారు. కోత్తపేట మార్కెట్ 22 ఎకరాలపై కేసీఆర్ కన్ను పడిందేమో అన్న అనుమానం ఉందన్నారు. మంత్రులు మాయమాటలు చెప్పి అర్ధరాత్రి మార్కెట్‌ను తరలించారని ఎంపీ ఆరోపించారు. కొహెడ మార్కెట్‌లో ప్రభుత్వం అరకొర సౌకర్యాలే కల్పించిందని... ఆహారం, తాగునీటి వసతి లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కోమటిరెడ్డి ఆరోపించారు. భోజన వసతి, రవాణా సౌకర్యం కూడా కల్పించలేదని ఆయన అన్నారు.

రైతులకు అకాల వర్షాల వల్ల ఒక్కరోజే రూ.4 కోట్ల నష్టం వచ్చిందని తెలిపారు. కొహెడ మార్కెట్ నిర్మాణానికి రూ.100 కోట్లు విడుదల చేయాలని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్​ చేశారు. రాచకొండ సీపీతో మాట్లాడి పోలీస్ చెక్‌పోస్టులు ఏర్పాటు చేయిస్తామని ఎంపీ స్పష్టం చేశారు.

ఇవీ చూడండి: రైతులు, కార్మికుల సమస్యలు పరిష్కరించాలి: నారాయణ

Last Updated : May 4, 2020, 7:58 PM IST

ABOUT THE AUTHOR

...view details