Mega Dairy Plant Opening ప్రారంభానికి ముస్తాబైన మెగా డెయిరీ Mega Dairy Plant Opening in Raviryala :తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి పథంలో జోరుగా ముందుకు సాగుతోంది. నిత్యం జాతికి ఉపయోగపడేలా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలో బీఆర్ఎస్ నాయకులు బిజీబిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే రంగారెడ్డి జిల్లాలో తెలంగాణ విజయ ఫెడరేషన్‌కు చెందిన మెగా డెయిరీ ప్రారంభించేందుకు అన్ని నిర్మాణ పనులు పూర్తి చేసుకొని ప్రారంభానికి సిద్ధమైంది.
Raviryala Mega Dairy Plant Opening :రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం మండలం రావిర్యాల వద్ద 40 ఎకరాల విస్తీర్ణంలో రూ.250 కోట్ల వ్యయంతో నిర్మించినమెగా డెయిరీ ప్రారంభం కానుంది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్(Minister KTR) చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరగనుంది. మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, మహేందర్‌రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు.
Mega Diary plant in Rangareddy : రూ.250 కోట్లతో రంగారెడ్డిలో మెగా డెయిరీ ప్లాంట్
Mega Dairy Specialties: నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డ్ - ఎన్‌డీడీబీ సహకారంతో 5 లక్షల 8 లీటర్ల ప్రాసెసింగ్ సామర్ధ్యంతో దేశంలోనే అత్యాధునిక, పూర్తిస్థాయి ఆటో మిషన్ ప్రాసెసింగ్ టెక్నాలజీతో నిర్మించారు. ఈ మెగా డెయిరీ నిర్వహణ కోసం సౌరశక్తి ఉత్పత్తి వ్యవస్థతో పాటు.. వ్యర్ధాల వినియోగం ద్వారా తయారైన విద్యుత్ ఉత్పత్తి చేసేలా ఏర్పాట్లు చేయడం ప్రత్యేకత.
VIJAYA DAIRY: పాడి రైతులకు ఆలంబన దిశగా.. సర్కారు ప్రత్యేక దృష్టి
ఈ మెగా డెయిరీ ద్వారా రోజుకు పాల ఉత్పత్తుల సామర్థ్యం కింది విధంగా ఉన్నాయి.
- పాల ప్రాసెసింగ్, ప్యాకేజింగ్ - 5 లక్షల నుంచి 8 లక్షల లీటర్లు
- పాల ఉత్పత్తి - లక్ష లీటర్ల టెట్రా బ్రిక్
- నెయ్యి ఉత్పత్తి - 10 టన్నులు
- ఐస్‌క్రీం - 5 వేల నుంచి 10 వేల లీటర్ల
- పెరుగు ఉత్పత్తి - 20 టన్నులు
- మజ్జిగ, లస్సీ తయారీ - 12 వేల లీటర్ల
- వెన్న తయారీ (నెలకు) - 30 టన్నులు
Vijaya product sales centers in Rangareddy : మెగా డెయిరీ ఏర్పాటు డెయిరీ చరిత్రలో ఓ మైలు రాయిగా నిలవనుందని మంత్రి తలసాని అన్నారు. తెలంగాణ ఆవిర్బావానికి ముందు తీవ్ర నిరాదరణకు గురై నష్టాల ఊబిలో కూరుకుపోయి ఒకానొక దశలో మూతపడే స్థితిలో ఉన్న విజయ డెయిరీ(Vijaya Dairy). తెలంగాణ ఆవిర్భావం తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవ వల్ల లాభాల బాట పట్టిందని చెప్పారు. గతంలో ఉన్న పాల ఉత్పత్తులకు అదనంగా కొత్తనూతన ఉత్పత్తులు మార్కెట్‌లోకి తీసుకొచ్చామని చెప్పారు. అంతేకాకుండా పెద్ద సంఖ్యలోవిజయ ఉత్పత్తి విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చామని వివరించారు.
Minister Talasani on Mega Dairy in Raviriyala : పోటీ మార్కెట్‌లో ప్రైవేట్ డెయిరీలకు దీటుగా విజయ ఉత్పత్తుల మార్కెటింగ్, ఔట్లెట్లు ఏర్పాటు చేసి లాభాల బాటలోకి తీసుకొచ్చామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. పాడి రైతులను ప్రోత్సహించే విధంగా రాయితీపై పాడి గేదెల పంపిణీ, గడ్డి విత్తనాలు సరఫరా చేస్తుమని పేర్కొన్నారు. లీటర్ పాలకు రూ.4 చొప్పున నగదు ప్రోత్సాహకాన్ని విజయ డెయిరీకి పాలు సరఫరా చేసే రైతులకే కాకుండా.. ఇతర సహకార డెయిరీలకు చెందిన అన్నదాతలకు అందిస్తామని చెప్పారు. రానున్న రోజుల్లో విజయ డెయిరీని మరింత అభివృద్ధి చేసి ప్రధమ స్థానంలో నిలుపుతామని మంత్రి తలసాని వెల్లడించారు.
TALASANI: 'త్వరలో పలు రాష్ట్రాల్లో డెయిరీ ఔట్ లెట్లు ప్రారంభిస్తాం'
రావిరాలలో మెగా డెయిరీ... ఏర్పాట్లన్నీ పూర్తి: తలసాని