కన్నుల పండువగా వెంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలు - బ్రహ్మోత్సవం
హైదరాబాద్ వనస్థలిపురంలోని పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో కన్నుల పండువగా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి.
వెంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలు
హైదరాబాద్ వనస్థలిపురం పద్మావతి సమేత వెంకటేశ్వరస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు రంగరంగవైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఉత్సవమూర్తులకు అభిషేకం, లక్ష్మీ కుబేర యాగం, తిరువీధి ఉత్సవం, హనుమత్ వాహనం, అష్టదళ పాద పద్మారాధన, శ్రీవారి కల్యాణ మహోత్సవం నిర్వహించారు. అనంతరం డాక్టర్ గరికపాటి నరసింహారావు మహాసాధ్వి ద్రౌపది వ్యక్తిత్వం అనే అంశంపై ప్రవచనం చేశారు.