తెలంగాణ

telangana

By

Published : Mar 31, 2020, 6:01 PM IST

ETV Bharat / state

కరోనా కట్టడిపై మున్సిపల్​ సిబ్బందితో మంత్రి సబితారెడ్డి సమావేశం

కరోనా కట్టడి చర్యల్లో భాగంగా ప్రజలంతా ప్రభుత్వానికి సహకరించాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు. కరోనా వ్యాప్తి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రంగారెడ్డి జిల్లా జల్పల్లి మున్సిపల్​ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు.

Education Minister meets with municipal staff on Corona preventive actions
కరోనా కట్టడిపై మున్సిపల్​ సిబ్బందితో విద్యాశాఖ మంత్రి సమావేశం

ముంచుకొస్తున్న కరోనా ముప్పును కట్టడి చేసేందుకు ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. లాక్​డౌన్​ సమయంలో ప్రజలు, అధికారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేస్తూ రంగారెడ్డి జిల్లా జల్పల్లి మున్సిపాలిటిలో మున్సిపల్​ సిబ్బందితో సమీక్ష నిర్వహించారు.

కరోనా కట్టడిపై మున్సిపల్​ సిబ్బందితో విద్యాశాఖ మంత్రి సమావేశం

ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని... ఎవరైనా నిత్యవసర వస్తువులు, కూరగాయలు అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరికైనా వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. ఈ సందర్భంగా తెరాస కౌన్సిలర్లు సీఎం రిలీఫ్ ఫండ్​కు తమ రెండు నెలల జీతం విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ అహ్మద్ సఫీఉల్లాహ్, ఛైర్మన్ అబ్దుల్లాహ్ సాది, వైస్ ఛైర్​పర్సన్​ ఫర్హానా నాజ్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

ఇవీచూడండి:తెలంగాణలో ఆరుకు చేరిన కరోనా మృతుల సంఖ్య

ABOUT THE AUTHOR

...view details