రంగారెడ్డి జిల్లా బండ్లగూడజాగీర్ మున్సిపల్ కార్పొరేషన్లోని 20వ వార్డు నుంచి పోటీచేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బొర్రా జ్ఞాన్ అభిలాశ్ను రాజేంద్రనగర్ పోలీసులు అరెస్టు చేశారు.
2010 సంవత్సరంలో ఎస్సీ, ఎస్టీ చట్టం కింద అభిలాశ్పై కేసు నమోదైంది. ఆ కేసుకు సంబంధించి ఆయన కోర్టుకు హాజరు కాకపోవడం వల్ల పోలీసులు అతడిపై నాన్ బెయిలెబుల్ కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు.