లాక్‌డౌన్ నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న నిరుపేద వలసకూలీలకు నాయకులు ఆపన్నహస్తం అందిస్తున్నారు. శేరిలింగంపల్లి ఆల్విన్ కాలనీ డివిజన్లో కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో చేవెళ్ల పార్లమెంటు సభ్యులు రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే గాంధీ 1000 మంది నిరుపేదలు, వలస కూలీలకు కూరగాయలు, గుడ్లు, బిర్యానీ పంపిణీ చేశారు.
ప్రజలు ఆకలితో ఇబ్బంది పడకూడదని సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు అందరికీ నిత్యావసర వస్తువులు, కూరగాయలు అందజేస్తున్నామని ఎంపీ రంజిత్‌రెడ్డి తెలిపారు. ఇంకా ఎక్కడైనా సమస్యలు తలెత్తినా తమ దృష్టికి తీసుకురావాలన్నారు.
నిరుపేదలకు చేవెళ్ల ఎంపీ ఆపన్నహస్తం - vegetables distribution
లాక్‌డౌన్ నేపథ్యంలో పలువురు నాయకులు పేదప్రజలను ఆదుకుంటున్నారు. ఆల్విన్ కాలనీ డివిజన్లో చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ 1000 మంది నిరుపేదలకు కూరగాయలు, గుడ్లు, బిర్యానీ పంపిణీ చేశారు.
నిరుపేదలకు చేవెళ్ల ఎంపీ ఆపన్నహస్తం
ఇవీ చూడండి: వనస్థలిపురం కాలనీల్లో కంటైన్మెంట్ జోన్లు