భాజపా కార్యకర్తలపై ప్రభుత్వం తప్పుడు కేసులు పెడుతోందని ఆరోపించారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో పార్టీ కార్యక్తలతో సమావేశమయ్యారు. తెరాస పతనం తుక్కుగూడ నుంచే ప్రారంభమైందని చెప్పారు.
తెరాస పతనం తుక్కుగూడ నుంచే: లక్ష్మణ్ - తెరాస పతనం తుక్కుగూడ నుంచే: లక్ష్మణ్
తెరాస పతనం తుక్కుగూడ నుంచే ప్రారంభమైందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. తమకు 9 స్థానాలు వచ్చినా.. అధికార పార్టీ ఛైర్మన్ పదవి దక్కించుకోవడం దారుణమన్నారు. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు.
తెరాస పతనం తుక్కుగూడ నుంచే: లక్ష్మణ్
మోదీ నిర్ణయాలే భాజపాకు అతిపెద్ద బలమన్నారు. పార్లమెంటు ఎన్నికలప్పుడు కేసీఆర్కు ప్రజలు తగిన బుద్ధి చెప్పారని గుర్తు చేశారు. ఒవైసీతో దోస్తీ కోసం సీఏఏను అడ్డుకుంటే ప్రజలు ఊరుకోరని పేర్కొన్నారు. సీఏఏను అడ్డుకోవడమంటే పాకిస్థానీ ముస్లింలకు మనదేశ పౌరసత్వం కోరడమేనని అన్నారు.
ఇదీ చూడండి:'నిర్భయ' కేసులో మరో దోషి క్యురేటివ్ పిటిషన్
TAGGED:
bjp